కాటమరాయుడులో మెగాస్టార్

కంగారు పడవద్దు..కంగు తినవద్దు..అన్నదమ్ములు ఏమీ కలిసి మల్టీ స్టారర్ చేయడం లేదు. చేసే ఉద్దేశం కూడా లేదు. కానీ కాటమరాయుడు తో మెగాస్టార్ మరి ఎలా లింక్ అయ్యారు అని క్వశ్చను మాత్రం వేసుకోవచ్చు. ఎలా అంటే కాటమ రాయుడు కోసం వేసిన ఓ సెట్ ను మెగాస్టార్ తన 150 వ సినిమా కోసం వాడుకోవడం ద్వారా. 

కాటమరాయుడు కోసం ఓ మాంచి సెట్ వేసారు. ఇప్పుడు అదే సెట్ ను ఈరోజు నుంచి ఖైదీ నెం 150 సినిమా కోసం వాడుతున్నారు. రెండు మూడు రోజుల పాటు ఇదే సెట్ లో షూటింగ్ కొనసాగుతుందని తెలుస్తోంది.  ఖైదీ నెంబర్ 150 సినిమాను సంక్రాంతి విడుదలకు టార్గెట్ చేసి రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రెండు మూడు రోజుల షూట్ కోసం సెట్ వేయాలి అంటే కాస్త టైమ్ పడుతుంది. 

అందుకే పవన్ సలహాతో కాటమరాయుడు సెట్ లో షూట్ చేసారని వినికిడి. కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడం, అలాగే ఆలీని ఓ కీలకపాత్రకు తీసుకోవడం, బుర్రా సాయి మాధవ్ చేత కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ రాయించడం వెనుక పవన్ వున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా అన్న సినిమాకు పవన్ అన్ని విధాలా సాయం పడుతున్నారు.

Show comments