జనతా 39 సరైనోడు 115

2016లో రెండు సినిమాలు.. బ్లాక్ బస్టర్లు..డెభై కోట్లకు ఫైగా షేర్ సాధించిన సినిమాలు. జనతా 70 నుంచి 74 అని వార్తలు. సరైనోడు కూడా 70 నుంచి 76 మధ్యలో అని వార్తలు. అసలు కలెక్షన్ల  లెక్కలు నిర్మాతలకే ఎరుక. కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నదానిపై ఫ్యాన్స్ మధ్య వాదనలు కామనే. వీళ్లవి ఫేక్ అని వాళ్లు, వాళ్లవి ఫేక్ అని వీళ్లు అక్కడక్కడ అనడం మామూలే. 

ఆ సంగతి అలా వదిలేస్తే, సినిమా రన్నింగ్ నే ఏది పెద్ద విజయం సాధించింది అనేదానికి గీటు రాయి అనుకుంటే మాత్రం సరైనోడు ముందు వుంటుంది. ఎందుకంటే 115 సెంటర్లలో యాభై రోజుల పండుగ చేసుకుందీ సినిమా. జనతా గ్యారేజ్ మాత్రం 39 సెంటర్లలోనే యాభై రోజులు ఆడింది. 2016లో విడుదలైన సినిమాల్లో ఈ రేంజ్ థియేటర్లలో యాభై రోజుల పండుగ చేసుకున్న మరో సినిమా లేదు.  

కలెక్షన్లు సంగతి జనాలకు పక్కాగా తెలియడం కష్టం. ఏ యూనిట్ కూడా అధికారికంగా కలెక్షన్లు ప్రకటించదు. అందువల్ల ఏ సినిమా కలెక్షన్లు కూడా పక్కా అని చెప్పడానికి లేదు. కానీ కనీసం థియేటర్ రెంట్ అయినా రాకుండా అన్నేసి థియేటర్లలో సినిమాను అన్ని రోజులు ఆడించడం మాత్రం కష్టం. ఆ విధంగా చూసుకుంటే సరైనోడిదే పై చేయి అనుకోవాలి.

Show comments