రాజమౌళి రికమెండ్ చేస్తున్న సినిమా

రాజమౌళి లాంటి దిగ్దర్శకుడు ఓ వీడియో విడుదల చేసాడు. దాంట్లో ఫలానా సినిమా చూడండి అంటూ నేరుగా రికమెండ్ చేసాడు. అదే మనమంతా. ఈ సినిమా విడుదలై ఇటు క్రిటిక్స్ తోటి, అటు చూసిన వారి నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. కానీ వాస్తవానికి కలెక్షన్లు అంతంత మాత్రంగానే వుంటున్నాయి. 

బహుశా అందుకే కావచ్చు, ఓ మంచి  సినిమాకు బాసటగా నిలవాలని రాజమౌళి ఓ వీడియో విడుదల చేసాడు. తెరమీద ఇంతటి భావోద్వేగాలు తానయితే చూడలేదని పేర్కొన్నాడు. మనమంతా ఒక గొప్ప సినిమా అన్నది చాలా చిన్నమాట అవుతుందని అన్నాడు. మనమంతా ఈజె గ్రేట్ ఫిల్మ్..ఒకవేళ చూడకపోతే వెంటనే చూడండి అంటున్నారు రాజమౌళి.

ఇప్పటికే దర్శకుడు సుకుమార్ కూడా ఓ విడియో మెసేజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Show comments