సింధూకి బాబు దిష్టే తగిలింది..!

‘’ కనీసం ఆ ఫైనల్ మ్యాచ్ అయిపోయే వరకూ కూడా ఆగలేకపోయాడు ఈ మహానుభావుడు.. ఆ పుష్కరాల ప్రచారంలో బిజీగా ఉన్నాడనుకొంటే.. ఎప్పుడు కన్నేశాడో ఈ ఒలింపిక్స్ మీద కన్నేశాడు. ఆ అమ్మాయి అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ దూసుకుపోతోంటే… ‘’నేనే.. నా ఘనతే’’ అంటూ మొదలెట్టేశాడు. కొన్ని గంటలు కూడా ఆగలేక.. మళ్లీ ఎక్కడ పీవీ సింధూ  ను జాతి కీర్తించేస్తుందో.. అని సొంత డబ్బా మొదలుపెట్టేశాడు.. కష్టపడి గెలిచిన వారు, సాధించిన వారే.. కీర్తిని తీసుకోవడానికి  ఇష్టపడరు. క్రెడిట్ ను ఓన్ చేశారు.. ఈ మహానుభావుడు మాత్రం తన రాజకీయం కోసం 21 ఏళ్ల అమ్మాయిని కూడా వదలకుండా వాగేశాడు.. కచ్చితంగా ఈ గడ్డం బాబు దిష్టే తగిలింది.. లేకపోతే దూసుకెళ్తున్న అమ్మాయి.. స్వర్ణాన్ని సాధించేస్తుందని అనుకున్న అమ్మాయి.. రజతానికి పరిమితం కావడం ఏమిటి? ఇదంతా చంద్రబాబు పుణ్యమే.. ఆయన దిష్టే కొట్టింది…’’

ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో.. ఒలింపిక్స్ మహిళల షటిల్ ఫైనల్ మ్యాచ్ మరికొంత సేపటిలో మొదలవుతుందనంగా.. సింధూకు మెడల్ రావడం తన ఘనతే, తన సహకారమే ఆ అమ్మాయి గెలిచేలా చేసిందని  ఏపీ సీఎం ప్రకటించుకోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.

అర్థం పర్థం లేని ఆయన ప్రచార యావపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు భజన పరుడే అనుకున్నాం కానీ.. మరీ ఇంత దారుణం అనుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా దేశంలోనూ.. ప్రపంచ రాజకీయాల్లో ఇంతలా డబ్బా కొట్టుకునే నేత, ప్రతిదాని క్రెడిట్ కోసమూ అల్లాడిపోయే మనిషి ఎవరూ ఉండకపోవచ్చనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 

సింధూను కన్నతల్లిదండ్రులు, ఆమెను బ్యాడ్మింటన్ లో అడుగడుగునా ప్రోత్సహించిన వాళ్లు కూడా.. ఆమెవిజయంతో తమ పాత్ర ఉందని చెప్పుకోవడం లేదు. ఆఖరికి సింధూ కూడా తన విజయం ఏదో గొప్ప అన్నట్టుగా మాట్లాడటం లేదు. ఆ పాప వయసు 21 యేళ్లు. కనీసం తనకు ఉన్న పరిపక్వత కూడా చంద్రబాబుకు లేకపోవడం ఏమిటి? ఎక్కడ ఆయన గొప్ప? ఇలాగే మాట్లాడుతూ ఉంటే.. ఆయన గొప్ప సంగతి అటుంచి.. చాలా మెట్లు దిగజారిపోవడమే అవుతుంది.. అంటూ మరికొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి ఫేస్ బుక్ లో. Readmore!

 సింధూ రజతం గెలవడం వరకే బాబుకు బాధ్యత ఉంది.. ఫైనల్ తను ఓడిపోవడంలో మాత్రం ఆయనకు బాధ్యత లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.  మరి గెలుపుకు తన ఘనతే అని చెప్పుకున్న బాబు.. ఇప్పుడు సమాధానం చెప్పగలరా? 

Show comments

Related Stories :