ఈ మంత్రిగారు బీజేపీనా.. తెలుగుదేశమా..?

విజయవాడలో ఆలయాల విధ్వంసం గురించి స్వామీజీల సభ జరిగితే.. ఆ సభ కు సంబంధించిన వార్త రాస్తూ పెట్టిన ఫొటోలో కామినేని శ్రీనివాస్ ను హైలెట్ చేసింది తెలుగుదేశం అనుకూల మీడియా! ఇది ప్రధానంగా స్వామీజీల సభ. ఈ కార్యక్రమంలో బీజేపీ వాళ్లు, ఆర్ఎస్ఎస్ వాళ్లూ పాల్గొన్నా.. ఇది స్వామీజీల సభ. వారి ఆగ్రహావేశాలను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది. అయితే పచ్చ మీడియా మాత్రం దీన్ని చంద్రబాబు అభినందన సభ కలర్ తీసుకురావడానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను హైలెట్ చేసింది.

విశేషం ఏమిటంటే.. ఈ సభలో కామినేని తీరుపై బీజేపీ వైపు నుంచినే నిరసన వ్యక్తం అయ్యింది! ఈ సభ నుంచి కామినేని అర్ధాంతరంగా వెనుదిరిగాడు! ఇది చంద్రబాబు అభినందన సభ కాదు.. అని గుర్తు చేసి, ఈ మంత్రిని అక్కడ నుంచి పంపేశారు స్వామీజీలు, కమలం పార్టీ కార్యకర్తలు.

సభ నుంచి ఈ మంత్రి అర్ధాంతరంగా వెనుదిరిగాడంటే.. ఈయనపై అప్పటికప్పుడు కాషాయదళం ఎంత ఆగ్రహాన్ని ప్రదర్శించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమంలో కామినేని చంద్రబాబు నాయుడి తరపున మాట్లాడాడు. బాబు తరపున వకాల్తా పుచ్చుకుని.. ఆలయాలన్నింటినీ అందంగా నిర్మించేస్తాడు చంద్రబాబు అని కామినేని వ్యాఖ్యానించాడు.

మరి ఈ మాత్రం దానికి ఇంత సభ పెట్టుకుంది? అని స్వామీజీలు అక్కడిక్కడ కామినేని పై  ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. జరిగిన దాని గురించి, అశాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా ఆలయాలను కూల్చేసిన విధానంపై నిరసన తెలపడానికి ఏర్పాటు చేసిన సభలో బాబు తరపున మాట్లాడటం స్వామీజీలను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో కామినేని సభ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగాడు. ఇప్పటికే కామినేని శ్రీనివాస్ తీరుపై భారతీయ జనతా పార్టీలో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరపున గట్టివాదించే ఈయన తీరుపై కమలం పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నారు. మిత్రపక్షమే కానీ.. మరీ ఇంతలా బురద పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వారి వాదన.

అదంతా ఒక ఎత్తు అయితే విజయవాడలో స్వామీజీల సభలో కామినేని తీరు.. ఈయన బీజేపీ నేత? లేక చంద్రబాబు ప్రతినిధా? అనే అనుమానాన్ని కలిగించింది. అయితే పచ్చమీడియా మాత్రం కామినేని మించిన స్వామీజీ ఎవరున్నారన్నట్టుగా..ఆయననే హైలెట్ చేసింది. చంద్రబాబు తరపున ఆయన వినిపించిన వాదనను హైలెట్ చేసింది.

Show comments