కొరటాల శివ తెలిసో, తెలియకో మరి ఓ విషయం వెల్లడించేసి, బోయపాటిని కార్నర్ లోకి తోసేసాడు. బోయపాటికి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సింహా. దాని కథ, మాటలు తనవే అని టాప్ డైరక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్వూలో స్మూత్ గా వెల్లడించేసాడు. బోయపాటి కథ, మాటలు రెండింటిలో ఒకదానికే క్రెడిట్ ఇస్తానంటే, ఆ ఒక్కటీ కూడా తనకు వద్దు అని వదిలేసినట్లు చెప్పీ చెప్పకుండా చెప్పేసాడు.
బోయపాటి కథల విషయంలో కాస్త వీక్ అన్న టాక్ వుంది. ఎగ్జిక్యూషన్ సూపర్ కానీ, కథ దగ్గర కిందా మీదా అవతారని, అందుకోసమే కథల కోసం తెగ వేటాడతారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. సరైనోడు కు కూడా గీతా ఆర్ట్స్ సంస్థ బోయపాటి కథను, ఒకటికి నాలుగు సార్లు కూడికలు, తీసివేతలు చేయించి, చేయించి, వాళ్లకు కావాల్సినట్లు మార్చుకున్నారు.
దమ్ము, లెజెండ్ కథలు గొప్ప కథలేం కావు. పైగా వాటిలో క్లారిటీ కూడా కాస్త తక్కువ. ఇప్పుడు కొరటాల శివ చెబుతున్న సంగతి చూస్తే, బోయపాటి మిగిలిన సినిమా కథ లపై కూడా ఆలోచన మొదలయ్యేలా వుంది.