ఈ వీకెండ్ ఎవరిదో...?

లాస్ట్ వీక్ మొత్తం కాటమరాయుడు హవా నడిచింది. కానీ ఈ వారం కాటమరాయడికి పోటీగా ఇంకొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాస్త హైప్ కలిగిన సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం ఈ నెలలో ఎక్కడా జరగలేదు. ఈవారం మాత్రం అలాంటి సినిమాలతో బాక్సాఫీస్ బిజీగా మారింది. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. 

ఈ వీకెండ్ గురుగా ముస్తాబయ్యాడు వెంకటేశ్. తమిళ్ లో ఇప్పటికే హిట్టయిన సాలా ఖదూస్ సినిమాను తెలుగులో గురుగా రీమేక్ చేశాడు. తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విడుదలకు ముందే చిరంజీవి లాంటి ప్రముఖులతో పాటు మీడియా కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకోవడంతో బజ్ బాగా క్రియేట్ అయింది. ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందనేది ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.

గురు సినిమాతో పాటు రెడీ అయింది రోగ్. ఇషాన్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కాబట్టి ఈ మూవీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది పూరిజగన్నాధ్ సినిమా. పక్కా పూరి స్టయిల్ లో తెరకెక్కిన సినిమా. అందుకే ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. లోఫర్, ఇజమ్ సినిమాలతో వరుసగా రెండు ఫ్లాపులు కొట్టిన పూరి, రోగ్ తో సక్సెస్ ట్రాక్ పైకి వస్తాడా రాడా అనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

గురు, రోగ్ సినిమాలతో పాటు నయనతార నటించిన డోర కూడా థియేటర్లలోకి వచ్చింది. సస్పెన్స్, హారర్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమాపై నయన్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇంతకుముందు నయన్ చేసిన మయూరి సినిమా హిట్ అవ్వడంతో డోరపై అంచనాలు పెరిగాయి. అంతకుమించి దీని గురించి చెప్పుకోవడానికేం లేదు.

సినీమహల్, కారులో షికారుకెళ్తే, ఎంతవరకు ఈ ప్రేమ అనే మరో 3 చిన్న సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. సలోనీ ఎక్స్ పోజింగ్ తో సినీమహల్ మూవీ పోస్టర్లు తళతళలాడుతున్నాయి. ఇక కాజల్ అందాలతో ఎంతవరకు ఈ ప్రేమ అనే సినిమా కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఆడియన్స్ ఫోకస్ మాత్రం గురు, రోగ్, డోర సినిమాలపైనే ఎక్కువగా ఉంది.

Show comments