బాబు బయోపిక్ తీసేవాళ్లే లేరా?

మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. యూనివర్సిటీలో ఎకనామిక్స్... రెండు ఎకరాలతో స్టార్ట్ చేసి స్టార్ హోటల్ నుంచి హెరిటేజ్ దాకా వేల కోట్లకు విజయప్రయాణం.. ఎన్టీఆర్ ను గద్దె దింపితే తన చాణక్యంతో నిలబెట్టిన వైనం.. అదే ఎన్టీఆర్ తాను విజయవంతంగా గద్దె దింపేసిన ట్విస్ట్.. పదేళ్ల అధికార అజ్ఞాత వాసం.. ఆపై మళ్లీ అధికార పీఠం.. నూతన రాజధాని నిర్మాణ కర్త.. ఇన్ని విశేషాలుున్నాయి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితంలో. 

మరి ఎవరూ ఆయనపై సినిమా తీసేందుకు ముందుకు రారేం? కేసిఆర్ సాధించిన విజయాల పాజిటివ్ ఏంగిల్ తో సినిమా తీయడానికి ఇద్దరు నిర్మాతలు ముందుకు వచ్చారు. ఆ ఇద్దరు తెలంగాణ వారు కావడం విశేషం.  మరి ఇండస్ట్రీ నిండా ఆంధ్ర జనాలే. నిర్మాతలు, దర్శకులు, నటులు. మరి వీరెవరు బాబు బయోపిక్ కాకున్నా, కనీసం విజయాలపైన అయినా ఓ సినిమా ప్లాన్ చేయచ్చుగా? 2019నాటికి బ్రహ్మాండంగా  పనికి వస్తుంది. 

ఇప్పుడు కేసిఆర్ పై రాజ్ కందుకూరి సినిమా 2018కే రెడీ అవుతుంది. అంటే దాదాపు వచ్చే ఎన్నికలకు ముందు. పాజిటివ్ ఏంగిల్ సినిమా కాబట్టి ఎన్నికల ప్రచారానికి కూడా భలేగా పనికివస్తుంది. మరి బాబు కోసం కూడా ఏ కేఎస్ రామారావో, దగ్గుబాటి సురేష్ బాబో, మురళీ మోహనో పూనుకోవచ్చుగా? విశాఖలో జస్ట్ కల్చరల్ క్లబ్ కు అన్ని ఎకరాలు కారుచౌకగా తీసుకున్నారుగా కేఎస్ రామారావు. 

అందుకోసమైనా ఈ విధంగా రుణం తీర్చుకోవచ్చు. మురళీ మోహన్ అయితే బాబుగారికి అత్యంత ఆప్తుడు. వీళ్లు కాకున్నా సినిమా రంగంతో మంచి సంబంధం వున్న గంటా అయినా పూనుకోవచ్చుగా.

Show comments