నిఖిల్ కు ఆఫర్ల వెల్లువ

ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది. ఆ సినిమా బడ్జెట్ కు, వసూళ్లుకు చూసుకుంటే బ్లాక్ బస్టర్ అనాల్సిందేగా. సెకెండ్ వీకెండ్ కూడా స్టడీగా వుండడం కాకుండా, థియేటర్లు పెంచుకోవడం విశేషం. దీంతో ఇండస్ట్రీ జనాల దృష్టి నిఖిల్ మీద పడింది. సినిమా టాక్ తెలిసిన వెంటనే అభినందనలు సరే, ఇప్పుడు ఆపర్లు వెల్లువెత్తుతున్నాయట.

నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేద్దామని ఆపర్ ఇచ్చారట. అలాగే చుట్టాలబ్బాయి ప్రొడ్యూసర్లు తాము కూడా రెడీ అన్నారట. అన్నింటికన్నా బెస్ట్ ఆఫర్ హీరో నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నుంచి వచ్చిందని వినికిడి. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేద్దామని, కథ, డైరక్టర్ అన్నీ నీ ఇష్టం అని, హీరో నితిన్ స్వయంగా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నిఖిల్ తో ఓ సినిమా నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్ కూడా మరో సినిమా చేద్దామని అంటున్నారట. చాలా మంది మంచి ఫ్యాన్సీ అమౌంట్ చెక్ లు పంపిస్తున్నారట. రెమ్యూనిరేషన్ కూడా ఇప్పటిదాకా తీసుకున్నదానికి మూడు రెట్ల వరకు ఆఫర్ చేస్తున్నారట. కానీ నిఖిల్ మాత్రం పూర్తిగా ఆచి తూచి అడుగేయాలని డిసైడ్ అయ్యాడు. ఎవరు మంచి కథ, డైరక్టర్ ను తెస్తే వాళ్లకే సినిమా అనే ఆలోచనలో నిఖిల్ వున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇలా ఆబ్లిగేషన్ కు లొంగి కోన వెంకట్ కు శంకరాభరణం చేసి తిన్న దెబ్బ నిఖిల్ కు పదే పదే గుర్తుకువచ్చి, జాగ్రత్తగా వుండమని హెచ్చరిస్తోంది. అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు వుండి కూడా, కోన వెంకట్ పుణ్యమా అని నిచ్చెన ఎక్కకుండా, పాము నోట్లో పడిపోయాడు. అందుకే ఈ సారి ఏ చెక్ అందుకోకుండా, ఎవరికి కమిట్ కావడం లేదట.

Show comments