నితిన్ ఫాదర్ సేవ్ అయినట్లేనా?

సినిమా యాపారం అంటేనే స్పెక్యులేషన్. సినిమాను బట్టి, కాంబినేషన్లను బట్టి, ట్రాక్ రికార్డును బట్టి కొనుక్కోవడం, టికెట్లు వసూలు చేసుకుని, అయితే లాభాలు, లేదంటే నష్టాలు చేసుకోవడమే. హీరో నితిన్ తండ్రి సుధాకర రెడ్డిది డిస్ట్రిబ్యూషన్ బ్యాక్ గ్రౌండ్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల ఆయన పెద్దగా ఆ రూట్లో సక్సెస్ లు చవిచూడడం లేదు. 

కాటమరాయుడు సినిమా ఆయనకు మిక్స్ డ్ ఫీలింగ్స్ అందించిందట. ఎలా అంటే, ఆ సినిమాకు ఆయన ఫిఫ్టీ పర్సంట్ పార్టనర్ గా వుందాం అనుకున్నారు. 18కోట్లు అవుట్ రేట్, రెండు కోట్ల రిటర్న్ గ్యారంటీ మీద ఆశియన్ సునీల్ తో కలిసి తీసుకున్నారు. క్యూబ్ లు, పబ్లిసిటీలు, ఇంకా ఇంకా మరో కొటిన్నర వరకు అయింది. 

అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏమిటంటే, నైజాంలో కాటమరాయుడు15కోట్ల దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రెండుకోట్లు రిటర్న్ వస్తుందనుకున్నా అయిదు కోట్లు లాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే సుధాకర రెడ్డి వాటాకు ఓ రెండున్నర పోవాల్సి వుంటుంది.

కానీ ఇక్కడ లక్ ఏమిటంటే, లాస్ట్ మినిట్ లో ఆయన సగం వాటాకు డబ్బులు కట్టలేక, పావలా వాటానే తీసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంటే అయిదు కోట్లే పెట్టారన్నమాట. అంటే ఇప్పుడు కోటి పాతికే పోయే అవకాశం వుంటుంది. కాస్త సెకెండ్ సెంటర్లు, అవుట్ రేట్ సెంటర్ల వల్ల కొంచెం రికవరీ అయితే, సుధాకర రెడ్డి లాస్ కోటి రూపాయిల లోపుకే సెట్ అవుతుంది. 
కానీ ఆశియన్ సునీల్ కు మాత్రం కాస్త బాదుడే.

Show comments