కాష్మోరా టాక్ తో పివిపి హ్యాపీ

పివిపి సంస్థ ఈ ఏడాది విడుదల చేసిన నాలుగో సినిమా కాష్మోరా. యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మించిన 'కాష్మోరా'ఈ రోజు విడుదలైంది.   సినిమాకు మంచి టాక్ వచ్చిందని, డివైడ్ టాక్ లేకపోవడం, మంచి ఓపెనింగ్స్ నమోదు చేయడం ఆనందంగా వుందని నిర్మాత పివిపి పేర్కొన్నారు.  కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ ప్రశంసిస్తున్నారని, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన 'కాష్మోరా' విజువల్‌ వండర్‌గా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తోందని పివిపి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ - ''ఊపిరి వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత చేసిన ఈ సినిమా నా కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమాని స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేను చేసిన కాష్మోరా, రాజనాయక్‌ క్యారెక్టర్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. హీరోగా, విలన్‌గా నేను చేసిన ఈ రెండు క్యారెక్టర్లు నా కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచిపోతాయి. మా 'కాష్మోరా' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసి నాకు దీపావళి కానుక అందించిన ప్రేక్షకులకు, తెలుగులో చాలా గ్రాండ్‌గా 600కి పైగా థియేటర్లలో రిలీజ్‌ చేసిన పివిపిగారికి నా థాంక్స్‌'' అన్నారు.

కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్‌: రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

Show comments