21 నుంచి బన్నీ-వక్కంతం సినిమా?

డిజె సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో వుంది. 23న విడుదలకు సిద్దం అవుతోంది. హీరో బన్నీ ఈ సినిమా ప్రమోషన్లలో కీలకంగా వుండాల్సి వుంది. అయినా కూడా గ్యాప్ తీసుకోకుండా, వక్కంతం వంశీతో చేయబోయే తరువాతి సినిమాకు రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది.

వక్కంతం వంశీ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఎప్పుడో పూర్తి చేసారు. అన్నీ రెడీగా వున్నాయి. అందుకే ఈ సినిమాను 21 నుంచి సెట్ మీదకు తీసుకువెళ్లే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక డిసెంబర్ నాటికి ప్రశాంతంగా ఫినిష్ చేసేయచ్చు.

జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలకు ప్లాన్ చేసుకోవచ్చు. అదే అయిడియాతో వక్కంతం సినిమాను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా తరువాత బన్నీకి లింగుస్వామి సినిమా కమిట్ మెంట్ వున్న సంగతి తెలిసిందే.

Show comments