గంటా కొడుకు సినిమాకు పది కోట్ల బడ్జెట్ నా?

తండ్రి మంత్రి. మామగారు దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి. అలాంటి తండ్రికి కొడుకు, మామకు అల్లుడు హీరోగా నటిస్తున్న సినిమా అంటే ఏ రేంజ్ లో వుండాలి. దేవెగౌడ మనవడి సినిమా మాదిరిగా డెభై కోట్ల రేంజ్ లో వుండాలి.  ఇదంతా మంత్రి గంటా శ్రీనివాసరాలు కుమారుడు రవితేజ సంగతే. అతగాడికి హీరొ కావాలని ఆశ. అందుకే జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. పేరు ఎవరిది వున్నా ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలిసిన సంగతే. 

అయితే అసలు ముచ్చట ఏమిటంటే, జయంత్ సి పరాన్జీతో నిర్మాతల ఒప్పందం ఏమిటి అంటే, వీళ్లు పది కోట్లు ఇవ్వడానికి, ఆయన సినిమా ఫస్ట్ కాపీ తీసి చేతిలో పెట్టడానికి. ఇక అన్ని ఖర్చులు, తగులు, మిగులు అన్నీ జయంత్ వే. ఆయన రెమ్యూనిరేషన్, స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్, ప్రొడక్షన్ ఖర్చులు అన్నీ ఆ పది కోట్లలోనే. 

మరి అలా అంటే గంటా కుమారుడి సినిమా లుక్ ఎలా వుంటుందో? ఎందుకంటే అంతంత మాత్రంగా తీసినా అయిదారుకోట్లు అయిపోతుంది. మరి భారీగా తీయాలంటే? ఈ మొత్తం సరిపోతుందా? పైగా అందులోంచి దర్శకుడు రెమ్యూనిరేషన్ తీసేయాలి కదా? అంటే ఇంతకీ గంటా సీరియస్ గా తన కొడుకును లాంచ్ చేస్తున్నట్లా? లేక ఏదో కుర్రాడు ముచ్చటపడుతున్నాడని పది కోట్లు వదిలేస్తున్నట్లా?

Show comments