ఎన్నాళ్లీ తాతల మూతుల నేతులు

ఎప్పుడో 1932లో పుట్టింది తెలుగు టాకీ. అంటే ఎనభై ఏళ్లకు పైమాటే. నెలకో సినిమా విడుదలకావడం మొదలై యాభై ఏళ్లు దాటి వుంటుంది. వారానికో సినిమా విడుదల కావడం మొదలై పాతికేళ్లు దాటి వుంటుంది. అలాగే ఇండస్ట్రీలో పదేళ్లు, పాతికేళ్లు, నలభై ఏళ్లు, యాభై ఏళ్లు ఇలా పునాది దిట్టం అయిపోయిన నటులు చాలా మందే వున్నారు. 

అంటే మనం రాసుకోవడం, తలుచుకొవడం మొదలుపెడితే రోజుకో సినిమా గురించి, రోజుకో నటుడి గురించి పేజీలకు పేజీలు నింపేసుకుంటూనే వుండొచ్చు. మల్లీశ్వరికి ఇన్నేళ్లు,  దేవదాసుకు ఇంత, మేఘసందేశానికి అంత, శంకరాభరణానికి అన్నేళ్లు, ఇలా ఎన్నో రాసుకోవచ్చు. కానీ గతమెంతో ఘనకీర్తి..కానీ ఇప్పుడేంటీ?

బూతులు, కాకుండా కోడ్తే గాల్లోకి ఎగిరే ఫైట్లు, అదీ కాకుండా వంశాలు, వ్యక్తుల సోత్కర్షలు. ఇవే కదా మన వర్తమాన సినిమాలోకం చాలా  అంటే చాలా వరకు. మరి మరో పాతికేళ్ల తరువాతో, యాభై ఏళ్ల తరువాతో, మన మీడియాకు సరదా పుట్టినా, మన సినిమా జనాలు తన ఘనతను విడుదల చేయాలనుకున్నా ఏముంటా? ఆ బూతు సినిమాకు పాతికేళ్లు, ఈ వీర కొట్టుడు సినిమాకు రజిత సంవత్సరం, ఇలాంటివేనా?

మన సినిమాగా మనం పలవిరించ గలిగే సినిమాలు, మనం గొప్పగా చెప్పుకో గలిగిన సినిమా రావడం మానేసాయి.. పొరపాటున వచ్చినా, పబ్లిసిటీ పటాటోపం కరువై జనాలకు చేరువయ్యే అవకాశమూ లేదు. ఇక మిగిలింది అల్లా ఒక్కటే తాతల మూతుల నేతుల వాసన చూసి మురిసిపోవడమే. Readmore!

Show comments

Related Stories :