ఫేస్ బుక్ ట్రెండ్స్ లో జగన్ మోహన్ రెడ్డి టాప్!

ప్రత్యేక హోదాపై పోరు తో నేటి సోషల్ ట్రెండ్స్ లో టాప్ లో నిలిచాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి జగన్ వైజాగ్ వెళ్లడం, అక్కడ పోలీసులు ఆయనను అడ్డుకోవడం.. తదనంతర పరిణామాల నేపథ్యంలో జగన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఎమర్జెన్సీ తరహాలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడంతో.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా స్పందించింది.

నేటి ఫేస్ బుక్ ట్రెండ్స్ లో జగన్ టాప్ లో ఉన్నాడు, బెంగళూరు యూనివర్సిటీ ప్రధానం చేసిన డాక్టరేట్ ను తిరస్కరించిన రాహుల్ ద్రావిడ్ ట్రెండ్స్ లో సెకెండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ లో భాగమైన నాదల్ మూడో స్థానంలో ఉన్నాడు. జగన్ కు సంబంధించిన పోస్టుల సంఖ్య నేషనల్, ఇంటర్నేషనల్ ట్రెండ్స్  కన్నా తక్కువలో ఉన్నా.. నేటికి టాప్ పొజిషన్ లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతే ఉన్నాడు. 

క్రికెటర్లు, టెన్నిస్ స్టార్ల కు ధీటైన స్థాయిలో సోషల్ మీడియాలో జగన్ పేరు నిలవడం గొప్ప సంగతే. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత గురించి ఇంత చర్చ అంటే ఒప్పుకోవాల్సిందే! అలాగే.. ‘ప్రత్యేక హోదా’ విషయంలో యువత ఎంతలా ఉద్రిక్తతతో ఉందో కూడా ఈ అంశం స్పష్టం చేస్తోంది.

హోదా విషయంలో జగన్ పోరాటానికి మద్దతుగా యువత ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టడంతోనే.. జగన్ పేరు ట్రెండ్స్ లో నిలిచింది. కాబట్టి.. ప్రత్యేక హోదా విషయంలో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ పొద్దు పుచ్చకూడదు.. ఈ వ్యవహారంపై యూత్ చాలా సీరియస్ గా ఉందని అధికార పక్షాలు అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. 

Show comments