పవన్‌ హీరోయిన్‌.. భయం భయంగా.!

'రాజ్‌ రిబూట్‌'.. 'రాజ్‌' సిరీస్‌లో తాజా చిత్రమిది. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇమ్రాన్‌ హష్మీ, గౌరవ్‌ అరోరా, కృతి కర్బందా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. 'రాజ్‌' సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ దాదాపుగా ప్రేక్షకుల్ని బాగానే అలరించాయి. ఈ సిరీస్‌ పట్ల ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్‌ నెలకొని వుంది. 

ఇక, ట్రైలర్‌ అంతా కృతి కర్బందా చుట్టూనే తిరిగింది. క్షణక్షణం ఆమె భయపడుతూ కన్పించింది ట్రైలర్‌లో. తెలుగులో కృతి కర్బందా 'బోణీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌తో 'తీన్‌మార్‌' సినిమాలోనూ, రామ్‌తో 'ఒంగోలు గిత్త' సినిమాలోనూ నటించింది కృతి కర్బందా. మొన్నీమధ్యనే రామ్‌చరణ్‌ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమాలో చరణ్‌కి అక్కగా నటించిన విషయం విదితమే. తెలుగులో కృతి కెరీర్‌ ఆశించిన మేర హిట్టేమీ అవలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

'రాజ్‌ రిబూట్‌'పై భారీ ఆశలతోనే వున్న కృతి కర్బందా, ఈ సినిమాలో బోర్డర్‌ దాటి మరీ గ్లామర్‌ పండించేసిందన్న ప్రచారం జరుగుతున్నా, తాజా ట్రైలర్‌లో ఆ స్థాయిలో ఎక్కడా గ్లామర్‌ కన్పించలేదు. ఇమ్రాన్‌ హష్మీ సినిమా అంటే లిప్‌ టు లిప్‌ కిస్‌లు మామూలేననుకోండి.. ట్రైలర్‌లోనే రెండు మూడు లిప్‌ టు లిప్‌ కిస్‌లకు ఛాన్సిచ్చారు. 

మొత్తమ్మీద, 'రాజ్‌ రిబూట్‌' ట్రైలర్‌ మరీ అంత గొప్పగా కాకున్నా, ఓకే అన్పించేలా వుంది. ఆద్యంతం భయపడుతూనే కన్పించింది ట్రైలర్‌లో కృతి కర్బందా.

Show comments