పవన్ ఫ్యాన్స్ కు గిఫ్ట్.. కొత్త ట్విట్టర్ ఖాతా

సరిగ్గా ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు ఓ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. అంతే అది ఆఖరిది. ఆ తర్వాత ఆ ట్విట్టర్ ఎకౌంట్ మళ్లీ పవన్ చేతుల్లోకి రాలేదు. అట్నుంచి అటే పోయింది. పవన్ ట్విట్టర్ ఎకౌంట్ లో ప్రాబ్లమ్ వచ్చిందంటూ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన ఆయన సన్నిహితులు దాన్నిరీస్టోర్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, పవన్ మరో ఖాతా తెరిచే యోచనలో ఉన్నారట.

త్వరలోనే తన అభిమానులకు కొత్త ట్విట్టర్ ఖాతాను అందించేందుకు రెడీ అవుతున్నారట పవన్. అయితే ఓ మంచి టైం కోసం ఎదురుచూస్తున్నారట. అది సినిమాలకు సంబంధించిన టైం కాదు, రాజకీయాలకు సంబంధించిన పర్ ఫెక్ట్ టైం. అవును.. మంచి పొలిటికల్ మూమెంట్ ఉన్నప్పుడు కొత్త ట్విట్టర్ ఖాతా ద్వారా రియాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారట పవన్. మరోవైపు పవన్ దగ్గరున్న టెక్నికల్ టీం మాత్రం ఇప్పుడున్న ఖాతాను రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

సినిమాల సంగతి పక్కనపెడితే రాజకీయాలకు సంబంధించిన ఏ అంశంపైనైనా ట్విట్టర్ లోనే స్పందిస్తారు పవన్. అలాంటి ట్విట్టర్ మూగబోయింది. మరొకరైతే ఈపాటికి ఇంకో ఖాతా తెరిచేవాళ్లే. కానీ పవన్ మాత్రం సమయం  కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఆ సమయం ఎప్పుడొస్తుందో. ఈసారి పవన్ ఖాతా తెరిచేలే చేసేది ఎవరు. బీజేపీ నాయకులా.. లేక టీడీపీ ప్రతినిథులా..?

Show comments