హెవీ రోడ్ బ్లాక్ చేసిన మహేష్ బాబు

మురగదాస్ డైరక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూట్ చాలా ఫాస్ట్ గా అహమ్మదాబాద్ లో జరుగుతోంది. నైట్ సీన్లు తీయాల్సి రావడంతో సాయంత్రం ఆరు నుంచి మార్నింగ్ ఆరు వరకు షూట్ చేస్తున్నారు. సమర్మతి నదిపై వున్న భారీ ప్లయి్ ఓవర్ తో సహా, ఓ ఆరు లైన్ల రోడ్ ను బ్లాక్ చేసి షూట్ చేస్తున్నారు. 

ఇందుకోసం అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. మొత్తం రోడ్లను బ్లాక్ చేసి, అరేంజ్డ్ ట్రాఫిక్,ఆర్టిస్ట్ లతో సీన్ క్రియేట్ చేసి, షూట్ చేస్తున్నారు. ఈ నెల 23 వరకు ఇక్కడే షెడ్యూలు కొనసాగుతుంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు హారిష్ జయ్ రాజ్ సంగీతం అందిస్తున్నారు. 

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అహమ్మదాబాద్ షెడ్యూలు తరువాత హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ కొనసాగుతుంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు టైటిల్ ను జనవరి ఫస్ట్ కు ప్రకటిస్తారని తెలుస్తోంది.

Readmore!
Show comments