ఆగస్ట్‌ 15న చరణ్ 'ధృవ' ఫస్ట్‌ లుక్‌

రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ధృవ' చిత్రం ఫస్ట్‌ లుక్‌ ఈ నెల 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఫస్ట్‌ లుక్‌ని ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజుకి విడుదల చేయాలనుకున్నా, ఆగస్ట్‌ 15వ తేదీకి ఫిక్స్‌ చేశారు. ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'ధృవ' టీజర్‌ని విడుదల చేయనున్నారట. 

ఇక, దసరా పండక్కి 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తని ఒరువన్‌'కి తెలుగు రీమేక్‌ 'ధృవ'. 'బ్రూస్‌లీ' తర్వాత చరణ్‌ చేస్తున్న సినిమా ఇదే. ఆ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు రామ్‌చరణ్‌. చిత్రంగా రామ్‌చరణ్‌ 'ధృవ' కోసం హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని రిపీట్‌ చేయడం గమనార్హం. 

ఇదిలా వుంటే, 'ధృవ' ఆడియో విడుదల వేడుకను సెప్టెంబర్‌ 2న పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నప్పటికీ, ఓ వారం రోజులు పోస్ట్‌ పోన్‌ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. చరణ్‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ 2న ఆడియో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట. ఆ వేడుకపైనే పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సంబరాల్ని జరపాలనీ, పవన్‌కళ్యాణ్‌నే ముఖ్య అతిథిగా పిలవాలనీ పవన్‌ భావిస్తున్నాడట. 

అన్నట్టు, 'ధృవ'లో చరణ్‌ లుక్‌కి సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు అనధికారికంగా బయటకు వచ్చేశాయి. Readmore!

Show comments

Related Stories :