బడా హీరోల కోసం కొత్త ముద్దుగుమ్మలు

ఇన్నాళ్లూ ఉన్న హీరోయిన్లతోనే సర్దుకున్నారు. ఈమధ్య కాలంలో స్టార్ హీరోలెవరూ కొత్తమ్మాయిల్ని ఇంట్రడ్యూస్ చేయడం లాంటి పనులు చేయలేదు.

మహేష్, పవన్, రామ్ చరణ్ లాంటి స్టార్లు హీరోయిన్లను రిపీట్ చేస్తుంటే... బన్నీ, రవితేజ లాంటి హీరోలు ఉన్న హీరోయిన్లలోంచే ఫ్రెష్ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఓ ఇద్దరు హీరోలు మాత్రం మరోసారి ఆ పాత కల్చర్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. తమ అప్ కమింగ్ మూవీస్ లో నటించేందుకు ఫ్రెష్ టాలెంట్ కోసం వెదుకుతున్నారు.

త్వరలోనే సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఓపెనింగ్ పూర్తయింది కానీ, సెట్స్ పైకి వచ్చేది మాత్రం బాహుబలి-2 రిలీజ్ అయిన తర్వాతే. ఈ గ్యాప్ లో లొకేషన్లు ఫైనలైజ్ చేయడంతో పాటు.. కుదిరితే ఇద్దరు కొత్తమ్మాయిల్ని హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేయాలని సుజీత్ భావిస్తున్నాడు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసిన ఈ కుర్ర దర్శకుడు ప్రస్తుతం హీరోయిన్ల వేటలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రెండు కొత్త ముఖాలు దొరక్కపోతే కనీసం ఒకర్ని అయినా ప్రభాస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకుంటున్నాడట. 

అటు బాలయ్య కూడా కొత్త ముఖాల కోసం వెయిటింగ్. మొన్నటివరకు శ్రియ, నయనతార, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లతో సర్దుకుపోయిన నటసింహం... ఈసారి మాత్రం తన 101వ సినిమాలో కొత్త అందాల్ని హీరోయిన్లుగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించి దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రకటన కూడా ఇచ్చాడు.

తను, చార్మి కలిసి స్థాపించిన "పూరి కనెక్ట్స్" అనే సంస్థ ద్వారా ఇద్దరు ముద్దుగుమ్మల్ని బాలయ్య సినిమా కోసం ఫైనలైజ్ చేయాలని నిర్ణయించాడు పూరి జగన్నాధ్. నిజానికి బాలకృష్ణ  సినిమాలో ముగ్గురు భామలకు చోటుందట. వీళ్లలో ఒకరు మాత్రమే స్టార్ హీరోయిన్ ఉంటారట. మిగతా ఇద్దరు కొత్త హీరోయిన్లను పూరి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడన్నమాట.

Show comments