వంశీ సినిమాకు ఏ సర్టిఫికెట్

సీనియర్ వంశీ చాలా అంటే చాలా కాలం తరువాత డైరెక్ట్ చేసిన సినిమా ఫ్యాషన్ డిజైనర్. ఈ సినిమా సెన్సారు కార్యక్రమం ఈరోజు పూర్తయింది. సింగిల్ కట్ లేకుండా, ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు. సినిమాలో హీరో మన్మధ రేఖను చేతిలో వుంచుకుని, అమ్మాయల వేట సాగిస్తుంటాడు.

ఆ వేట మాంచి రంజుగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాత్ రూమ్ ల్లోకి వెళ్లి ఫోటొలు తీయడం ఇలా అన్నమాట. వీటిల్లో చాలా వరకు కత్తెర వేస్తే, యు/ఎ వస్తుంది కానీ దాని వల్ల సినిమా మొత్తం జంప్ లు జంప్ లు అవుతుంది.

పైగా అమీషా అంబ్రోస్ కు హీరో సుమంత్ అశ్విన్ చీర కట్టే సన్నివేశం ఒకటి వుంటుంది సినిమాలో. అది మాంచి హాట్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ సీన్ మొత్తం లేపేయమని సెన్సారు కోరినట్లు తెలుస్తోంది. అలా లేపకపోతే ఎ సర్టిఫికెట్ తప్పదన్నారట. ఆఖరికి సర్టిఫికేట్ కన్నా సీన్లే ముఖ్యం అని ఎ వైపే మొగ్గారు.

సినిమా విడుదల తరువాత టాక్ ను బట్టి, శాటిలైట్ వస్తే, కావాలంటే కొన్ని సీన్లు తీసి, మళ్లీ శాటిలైట్ కోసం రీ సెన్సారు చేయించుకోవచ్చన్నది నిర్మాత ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బి సి సెంటర్లలో బాగా టికెట్ లు బాగా తెగాలంటే, ఈ సీన్లు వుండడమే బెటర్ అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎటొచ్చీ మల్టీ ఫ్లెక్స్ ల్లొనే పిల్లలతో వెళ్లే ఫ్యామిలీలకు సమస్య వుంటుంది.

Show comments