రాజకీయ దాడిలో నగ్న చిత్రాలా.. ఇండియానే బెటర్!

రాజకీయ రణరంగంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు అమెరికన్లు. ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశంగా పేర్గాంచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుతం పార్టీలు పరస్పర దాడులు చేసుకొంటున్న విధానాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల్లో భారత రాజకీయ నేతల తీరే హేయం అనుకొంటే.. తాము ఇంకా ఒక మెట్టు దిగువనే ఉన్నామని అమెరికన్లు నిరూపించుకుంటున్నారు.

రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కాదు.. ఇద్దరూ ఇద్దరే. హిల్లరీ క్లింటన్ అర్ధనగ్న చిత్రాన్ని రిపబ్లికన్లు రోడ్డు మీద వేయించగా, ట్రంప్ భార్య నగ్న చిత్రాలను బయటకు తీసుకొచ్చారు డెమొక్రాట్లు! ఆ చిత్రాలను చూపిస్తూ.. అమెరికన్ ప్రథమ మహిళగా ఉండదగిన అర్హత ఆమెకు ఉందా? అని వీరు ప్రశ్నిస్తున్నారు. 

మరి రాజకీయ విమర్శలు అన్నీ అయిపోయి.. ఇలా ఆడవాళ్ల నగ్న చిత్రాల మీద పడటం అక్కడి రాజకీయ నేతల మనస్తత్వాన్ని చాటుతోంది. అది కూడా ఆయా పార్టీలు దాదాపుగా అధికారికంగా ఆడవాళ్ల  మీద దాడులు మొదలుపెట్టాయి. ఇదంతా చూస్తుంటే.. పురాతన ప్రజాస్వామ్యం లో స్త్రీకి ఉన్న విలువ ఏమిటో కూడా అర్థమవుతోంది.
కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నికల ప్రజాస్వామ్యం ఉన్నా యూఎస్ ఇప్పటి వరకూ ఒక్క మహిళను కూడా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టలేకపోయింది. ఇప్పటికి కనీసం ఒక పార్టీ తరపున ఒక మహిళ అధ్యక్ష పీఠానికి అభ్యర్థిత్వాన్ని సాధించింది. అలాంటి ఎన్నికల్లో కూడా ఇలా జరుగుతుండటం నిస్సందేహంగా హేయమే!

Show comments