ఫిబ్రవరి 3న కనుపాప

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రాన్ని క‌నుపాప టైటిల్ తో ఓవ‌ర్ సీస్ నెట్ వ‌ర్క్ ఎంట‌ర్ టైన్మెంట్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. హీరో మోహ‌న్ లాల్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌నుపాప చిత్రం ఫిబ్ర‌వ‌రి 3న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఈ సంద‌ర్భంగా  ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శ్రీనివాస‌మూర్తి మాట్లాడుతూ...మ‌న్యం పులి త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న మోహ‌న్ లాల్ చిత్ర‌మిది. ప‌సివాడి ప్రాణం త‌ర‌హాలో ఉండే విభిన్న క‌థా చిత్ర‌మిది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ గుడ్డివాడుగా న‌టించారు.

హ్యుమ‌న్ వాల్యూస్ ఉన్న క‌నుపాప మూవీ మంచి సినిమాగా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను కూడా పొందుతుంది అని నా న‌మ్మ‌కం. ఫిబ్ర‌వ‌రి 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.... ఈ చిత్రాన్ని ఆద‌రించి తమ తొలి ప్ర‌య‌త్నానికి విజ‌యం అందిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు. మోహ‌న్ లాల్, బేబీ మీనాక్షి, విమ‌లా రామ‌న్, అనుశ్రీ, స‌ముద్ర‌ఖ‌ని, నేడుముడి వేణు, రేన్జి ప‌ణిక్క‌ర్, చెంబ‌న్ వినోద్ జోష్ త‌దిత‌రులు నటించారీ చిత్రంలో.

Show comments