'ధోనీ'ని తక్కువ అంచనా వేసారు

ధోనీ బయోపిక్ విడుదలవుతుంటే, పెద్దగా ఆసక్తి కనిపించలేదు సినిమా జనాల్లో. బయోపిక్ అది కూడా ఓ స్పోర్ట్స్ పర్సన్ ది ఎవరు చూస్తారు. అందులోనూ తెలుగులో అని అనుకున్నారంతా. మహా అయితే మల్టీ ఫ్లెక్స్ ల్లో చూస్తారు అనుకున్నారు కొందరు. కానీ ఇప్పుడు ఎ, బి సెంటర్లలో కూడా ధోనీ సినిమా మీద ఆసక్తి కాస్త బాగానే వుంది. రిపోర్ట్ లు వస్తున్నాయి. 

ఫాక్స్ మూవీస్ సంస్థ ఈ సినిమాను నేరుగా తెలుగులో విడుదల చేసింది. విక్రయాలు ఏమీ చేయలేదు. అందువల్ల కాస్త షేర్ ఆ సంస్థకు బాగానే వచ్చేలా కనిపిస్తోంది. మల్టీ ఫ్లెక్స్ ల సంగతి అలా వుంచితే, సోలో థియేటర్లలో కుర్రాళ్లు థోనీ సినిమా చూస్తూ, కేరింతలు కొడుతూ, డ్యాన్స్ లు చేయడం చూస్తుంటే, ఇదంతా క్రికెటర్ గా ధోనీ సంపాదించుకున్నక్రేజ్ అని అర్థం అవుతోంది. కానీ మన ఇండస్ట్రీ జనాలే ఆ సినిమాను కాస్త తక్కువ అంచనా వేసారు. 

Readmore!
Show comments