ఐశ్వర్య హాట్ నెస్ కు విరామం లేదు!

మొన్నటి వరకూ “యే దిల్ హే ముష్కిల్’’ కు సంబంధించిన స్టిల్స్ తో వేడెక్కించిన ఐశ్వర్య.. ఆ సినిమా హడావుడి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా.. హాట్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేయడాన్ని కంటిన్యూ చేస్తోంది. వయసు నలభై రెండు దాటినా.. వివాహం, పిల్లల బాదరబంధీలు ఉన్నా.. ఐష్ మాత్రం నేటి తరం హీరోయిన్లకు ధీటుగా దూసుకుపోవాలనే ప్రయత్నంలో ఉంది. ఆమెకు క్రేజూ ఉంది. 

ఈ రెండింటికీ మధ్య అనుసంధానం ఉండాలంతే.. అందుకే ఇప్పుడు ఐష్ రెచ్చిపోయే పోజులు ఇస్తున్నట్టుగా ఉంది. ఈ ఫొటోల ద్వారా అవకాశాలు వేటను సాగిస్తున్నట్టుగా ఉంది. గ్లామర్ విషయంలో తను ఎవరికీ తీసిపోనని ఐష్ నిరూపించుకుంటోంది.

అందుకోసం విరామం లేకుండా కష్టపడుతోంది. ఒక మ్యాగజైన్ కవర్ పేజీకి ఇచ్చిన పోజు ఒకటి, మరోటి ఒక జువెలరీ సంస్థ నగల బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చిన పొజు. ఐశ్వర్య పోజులు దిల్ హే ముష్కిల్ సినిమా కలెక్షన్లకు ఊతం ఇచ్చాయి.. మరి ఈ పోజులు ఆమె గ్లామరస్ సినీ జర్నీకి ఊపునిస్తాయేమో చూడాలి!

Show comments