పెళ్లైన హీరోయిన్ తో.. యంగ్ హీరోకి అక్రమసంబంధం?!

ఆమె వివాహిత.. విడాకులకు అప్లై చేసిందని అంటున్నారు కానీ, భర్తకు దూరంగానే ఉంటోంది కానీ.. ఇంకా అధికారికంగా విడిపోలేదు.

అతడు ఇంకా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.. తండ్రి నుంచి వచ్చిన నేపథ్యంతో ఇతడు సినీ పరిశ్రమలోకి వచ్చాడు.
 
ఇక వయసులో ఆమె కన్నా అతడు చిన్నవాడు. ఏ విధంగానూ సంబంధం లేదనిపించే వీళ్ల మధ్య అక్రమ సంబంధం ఉందని బాలీవుడ్ ఇప్పుడు కోడై కూస్తోంది. 

ఆమె.. మలైకా అరోరా, అతడు అర్జున్ కపూర్. మలైకాకు నటిగా, డ్యాన్సర్ గా గుర్తింపే గాక, సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు భార్యగా కూడా గుర్తింపు ఉంది. చాన్నాళ్ల పాటు దాంపత్యాన్ని కొనసాగించిన ఖాన్- మలైకాలకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కొన్ని నెలల కిందట వీరు వేరు పడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సల్మాన్ –అర్భాజ్ ల ఇంటిని ఖాళీ చేసి మలైక బాంద్రాలో ఒక అపార్ట్ మెంట్ కు మారింది. తనతో పాటు కొడుకును కూడా తెచ్చుకుందామె.

ఇటీవల అర్భాజ్-మలైకాల విడాకుల అంశంపై ఆసక్తికర వార్తలే వచ్చాయి. వీరు విడాకుల ఆలోచనను  రద్దు చేసుకున్నారనే మాట వినిపించింది. ఇంట్లో వాళ్ల చొరవతో.. వాళ్లిద్దరూ కలిసిపోయే  యత్నం చేస్తున్నారనే మాట వినిపించింది. అయితే ఇంతలోనే.. మలైకా ఇంటి బయట అర్జున్ కపూర్ తచ్చాడటం,  రాత్రి పదిన్నరకు ఆమె ఇంటికి వెళ్లి ఒకటిన్నరకు బయటకు రావడం.. ఇదంతా వీడియోలకు ఎక్కి అటునుంచి వెబ్ లో ఆ వీడియో విహారం చేయడం జరిగింది. అప్పటికే ఉన్న కొన్ని గుసగుసలకు ఈ వీడియో ఊపునిచ్చింది. Readmore!

మలైక- అర్జున్ ల మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అనే మాట.. బాలీవుడ్ ను ఊపేస్తోంది. మరి వివాహిత అయిన మలైకతో అర్జున్ కు ఈ తతంగం ఏమిటో అర్థం కావడంలా. ఇప్పటికే ఈ విషయంలో తండ్రి బోనీ కపూర్ కూడా అర్జున్ ను దండించాడట. సల్మాన్ ఫ్యామిలీతో పెట్టుకోవద్దని కూడా సలహా ఇచ్చాడట. అయితే అర్జున్ ఆ హెచ్చరికలను ఖాతరు చేయనట్టుగా ఉన్నాడు. వీడియో అంశంపై ఇప్పటి వరకూ మలైకా కానీ, అర్జున్ కానీ,  సల్మాన్ ఫ్యామిలీ కానీ స్పందించలేదు.

Show comments