వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు బన్నీ. రేపు ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. సినిమాకు సంబంధించి "నా పేరు సూర్య" అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. "నా ఇల్లు ఇండియా" అనే ట్యాగ్ లైన్ కూడా దీనికుంది. అయితే యూనిట్ మాత్రం టైటిల్ పై రేపు క్లారిటీ ఇస్తామంటోంది.
బన్నీ-వక్కంతం సినిమా ఓపెనింగ్ రోజునే టైటిల్ ను కూడా ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటికే చలామణిలో ఉన్న "నా పేరు సూర్య" అనే టైటిల్ పెడతారా లేక కొత్తగా మరో టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. "నా పేరు సూర్య" అనే టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. ఇలాంటి టైటిల్ మార్చి కొత్తగా ఇంకో పేరు ఫిక్స్ చేస్తారని ఎవరూ అనుకోరు.
లగడపాటి శ్రీధర్ నిర్మించబోతున్న ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడు. ఇన్నాళ్లూ కథా రచయితగా కొనసాగిన వక్కంతం వంశీ, ఈ మూవీతో దర్శకుడు కావాలనే తన కోరికను నెరవేర్చుకోబోతున్నాడు. రేసుగుర్రం, కిక్, టెంపర్ లాంటి సినిమాలకు వక్కంతం కథ అందించిన విషయం తెలిసిందే.