వెంకీ... కర్మ సిద్దాంతం

గురు సినిమా విడుదలయిపోయి నెలలు గడచిపోతున్నాయి. కానీ హీరో వెంకటేష్ కు సరైన సినిమా దొరకలేదు. నిర్మాతలకు కొదవలేదు. వెంకీ రెడీగానే వున్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వెంకీకి సంతృప్తి కలిగించే కథ చెప్పలేకపోతున్నారట. ఎవరెవరో వస్తున్నారు, కథలు చెబుతున్నారు. వెళ్తున్నారు. వెంకీకి మాత్రం నచ్చడం లేదు.

సరైన కథ ఎక్కడుందో? ఎవరి దగ్గర వుందో? తెలియడం లేదు. ఎవరు కథ చెబుతామన్నా ఓకె అంటున్నారట. కానీ తీరా కథ చెప్పాక మాత్రం ఓకె అనలేకపోతున్నారట. దీంతో రోజులు అలా దొర్లిపోతున్నాయి అంతే. 'ఏం చేస్తాం.. భగవానుడు కాస్త గ్యాప్ తీసుకోమని చెప్పారేమో? అందుకే ఈ గ్యాప్, కానివ్వండి అంటూ ఫిలాసిఫికల్ కబుర్లు చెబుతున్నారట వెంకీ'.

అసలే ఫిలాసఫీ అంటే మహా ఇష్టం, నమ్మకం వెంకటేష్ కు. అందుకే రాసిపెట్టి వుంటే కథ మన దగ్గరకు అదే వస్తుంది. రాసి పెట్టి లేకపొతే ఇలా ఖాళీగా వుండక తప్పదు. అంటూ సరిపెట్టుకుంటున్నాడట. అదేంటో ఇండస్ట్రీలో ఇంతమంది డైరక్టర్లు, కథకులు వుండి కూడా వెంకీ వయసుకు, మనసుకు నచ్చే కథ చెప్పలేకపోతున్నారు?

దృశ్యం, గోపాల గోపాల, గురు అంటూ రీమేక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మరి పక్క భాషల్లో కూడా వెంకీకి నప్పే సినిమాలు రావడం లేనట్లుంది?

Show comments