ఒకేరోజు ఇద్దర్ని ఫైనల్ చేసిన కాలా

ఇవాళ్టి నుంచి ముంబయిలో "కాలా" రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్.. షూటింగ్ మొదలైన మొదటి రోజు కూడా అదే ఊపు కొనసాగిస్తోంది. వరుసపెట్టి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేస్తోంది. అంతేకాదు, సినిమాకు కీలకమైన హీరోయిన్, విలన్ పాత్రల్ని కూడా ఈ రోజే ఫైనలైజ్ చేసింది.

కాలా సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. ఇక విలన్ గా మరో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను ఎంపిక చేశారు. వీళ్లిద్దర్నీ సెలక్ట్ చేసినట్టు ఈరోజు అఫీషియల్ గా ప్రకటించారు. పనిలో పనిగా ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు.

ముంబయి బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయాల్సిన సన్నివేశాలు పూర్తయ్యే వరకు యూనిట్ అక్కడే ఉంటుంది. అందుకే మొదటి షెడ్యూల్ ఎన్నిరోజులు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. మరోసారి ముంబయి షెడ్యూల్ లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ముంబయిలోని ధారావి ప్రాంతాన్ని పోలిన సెట్ ను చెన్నైలో నిర్మిస్తున్నారు. దాదాపు 5కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటుచేస్తున్న ఈ సెట్ లోనే "కాలా" సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.

Readmore!
Show comments