న్యూయార్క్ సిటీ కాదు.. న్యూడ్ యార్క్ సిటీ!

నిరసన తెలపడానికి న్యూ యార్క్ వాసులు “నగ్న’’ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఒక విషయంలో అని కాదు.. ఒకసారి అని కాదు.. అనునిత్యం ప్రతి విషయంలో నూ.. నగ్న ప్రదర్శనల ద్వారానే నిరసన తెలపడాన్ని అలవాటు చేసుకున్నట్టుగా ఉన్నారు ఇక్కడి జనాలు. ఏ ఇష్యూ మీద అయినా భారీ స్థాయి నగ్న ప్రదర్శనలు చేసి.. దిశ మొలతో రోడ్లంటా, పార్కుల్లో ధర్నాలకు కూర్చుని, ర్యాలీలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు ఈ అమెరికన్ పౌరులు.

ఒక రోజే మో జెండర్ ఈక్వాలిటీ కోసం ఛాతిని ప్రదర్శిస్తూ తిరుగుతారు ఆడవాళ్లు, ఇంకో రోజు నిపుల్ ఫ్రీ మూమెంట్ అంటారు, ఇక ట్రంప్ తీరు పై నిరసన తెలిపే వాళ్లు అయితే టక్కున బట్టలిప్పేస్తారు!

ఇప్పటి వరకూ ట్రంప్ కు వ్యతిరేకంగా బోలెడన్ని నగ్న ప్రదర్శనలు జరిగాయి. కొన్ని వందల మంది ఒక్కో చోట కూడి.. ట్రంప్ విచ్ఛిన్నకారి అంటూ ధ్వజమెత్తారు. అతడి తీరును ఖండించడానికి నగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. మామూలు ప్రదర్శనలను అయితే మిగతా ప్రపంచం అంతగా పట్టించుకోదు. కానీ నగ్న ప్రదర్శనలు అనే సరికి.. అన్ని కెమెరాలూ అటు వైపు తిరుగుతున్నాయి. వీళ్ల నిరసనలకు అంతర్జాతీయ ప్రచారం వస్తోంది. తాజాగా ఒక బ్రిటన్ పత్రిక న్యూయార్క్ వేదిక గా జరుతున్న నగ్న ప్రదర్శనలన్నింటినీ ఉద్దేశిస్తూ.. ఆ నగరాన్ని “న్యూడ్ యార్క్’’ అని సంబోధించింది!

Show comments