ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

గత వారం విడుదలైన 'జయమ్ము నిశ్చయమ్మురా' ఘోరంగా ఫ్లాపయింది. హీరోగా బ్రేక్‌ కోసం ఆశించిన శ్రీనివాసరెడ్డికి చుక్కెదురైంది. కామెడీ సినిమా చేయకుండా డ్రామా చిత్రాన్ని ఎంచుకోవడంతోనే అతను పొరపాటు చేసాడు. సినీ పరిశ్రమ తరఫు నుంచి ఎంత పుష్‌ ఇచ్చినా కానీ సగటు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.

'రెమో' చిత్రానికి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. శివకార్తికేయన్‌ని తెలుగు మార్కెట్‌కి పరిచయం చేయడానికి పబ్లిసిటీపై చాలానే ఖర్చు పెట్టారు. ఆ పబ్లిసిటీ ఖర్చుల వరకు తిరిగి వస్తాయని ట్రేడ్‌ అంటోంది. రెండవ వారంలోను అదరగొట్టిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

నిఖిల్‌ చిత్రాల్లో అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ చిత్రం పన్నెండు కోట్లకి పైగా రాబడితో ఈ ఏడాది వచ్చిన బిగ్‌ హిట్‌ సినిమాల్లో ఒకటైంది. ఈవారంలో రెండు అనువాద చిత్రాలను భారీ స్థాయిలో విడుదల చేసారు. భేతాళుడు, మన్యం పులి చిత్రాలు వచ్చే వారం 'ధృవ' రిలీజ్‌ అయ్యేవరకు బాక్సాఫీస్‌ని బిజీగా ఉంచుతాయని ఆశిస్తున్నారు.

Show comments