మొన్న లక్ష్మీదేవిగా ఓ షార్ట్ ఫిలింలో కనిపించిన బాలీవుడ్ భామ కంగనా రనౌత్, తాజాగా 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ, 'లవ్ యువర్ కంట్రీ' అనే వీడియో ఆల్బమ్‌లో కనిపించి మెప్పించింది. ఒకప్పుడు కంగనా వేరు, ఇప్పుడు కంగనా వేరు. ఒకప్పుడు గ్లామర్ తప్ప, కంగనా రనౌత్‌కి ఇంకోటి తెలియదు. కానీ, కంగనాలో చాలా మార్పులొచ్చేశాయి.
విలక్షణమైన పాత్రల్ని ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. నటిగా విమర్శకుల ప్రశంసలే కాదు, ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకుంటోంది కంగనా రనౌత్. అడపా దడపా ఆమెపై కొన్ని వివాదాలు పుట్టుకొస్తున్నా, సక్సెస్‌ఫుల్ కెరీర్ ముందు ఆ వివాదాల అడ్రస్ గల్లంతవుతోంది. సక్సెస్ అందుకోవడమే కాదు, సక్సెస్‌ల ద్వారా వచ్చే పాపులారిటీని సమాజం కోసం కాస్తయినా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో వుందిప్పుడు కంగనా రనౌత్.
అందుకేనేమో, సోషల్ మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిలింస్, వీడియో ఆల్బమ్స్‌లో కన్పిస్తోంది. తాజా వీడియో ఆల్బమ్‌లో, దేశభక్తిని పెంచేలా రూపొందించారు. అదే సమయంలో, సమాజంలోని అత్యాచారాలు, భ్రూణ హత్యలు, వరకట్నం తదితర సమస్యల్ని కూడా ఇందులో చర్చించారు. ఇంకా కంగనా నుంచి ఇలాంటి ఆల్బమ్స్, షార్ట్ ఫిలింస్ చాలానే రానున్నాయట. వీటి కోసం కంగనా ఏమాత్రం రెమ్యునరేషన్ తీసుకోవడంలేదట. దేశం నాకు పాపులారిటీని ఇచ్చింది, దేశానికి నేనేమివ్వగలను.? అన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నానని కంగనా రనౌత్ అంటోంది. వావ్ కంగనా, మళ్ళీ క్లీన్ బౌల్డ్ చేసేశావ్.