వైఎస్ పేరు రాయడానికి మనసు రావడం లేదు

పోలవరం ప్రాజెక్టు పై ఇంత హంగామా జరుగుతోంది. అది ఎంత హంగామా అంటే, పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సాధించెను..నిర్మించెను అని భవిష్యత్ పాఠ్య పుస్తకాల్లో కనిపించేంత. కానీ వాస్తవానికి దశాబ్ధాలుగా మూలన పడిన పోలవరం ప్రాజెక్టును కదిపి, ఖర్చు చేసి, కేంధ్రాన్ని ఒప్పించి, వీలయినన్ని అనుమతులు రాబట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నది నికార్సయిన వాస్తవం. ముందు చూపుతో కాల్వలు తవ్వించింది ఆయనే. మరి ఆ ముక్క మాత్రం రాయడం లేదు.

ఈ రోజు ఓ ప్రముఖ దినపత్రిక పోలవరం వ్యవహారం కాస్త రాయగలిగింది. కానీ అక్కడ కూడా..పొరపాటున వైఎస్ పేరు రాకుండా అప్పటి ప్రభుత్వం..అప్పటి ప్రభుత్వం అంటూ రాసుకువచ్చారు. 

''జల యజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2005లో ప్రారంభమైంది. కుడి ఎడమ కాలవలు, స్పిల్ వే, రాక్ ఫిల్ డ్యాం, అనుబంధ పనులను ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు.  ఈ ప్రాజెక్టుకు కేంద జల సంఘం 2009 లో సాంకేతిక అనుమతి ఇచ్చింది. అదే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రణాళికా సంఘం ఖర్చును ఓకె చేసింది. ఓ ఏడాది కేంధ్రం నుంచి నిధులు వచ్చాయి. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టమని అప్పటి రాష్ట్ర పభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ మేరకు ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టమని సిఫార్స్ చేసింది. అయితే లేటెస్ట్ ఎస్టిమేషన్లు కావాలని అడిగింది. ఆ తరువాత అది అలా వుండిపోయింది. విభజన సమయంలో చట్టంలోకి చేరింది..''

ఇదీ పోలవరం గురించి ఆ పత్రిక రాసిన మేటర్. అంటే ఇప్పుడు చెప్పండి..పోలవరం చంద్రబాబు ఘనతా? వెంకయ్య ఘనతా? లేక అప్పటి ప్రభుత్వం ఘనతా? కేంద్రం కేసి చూడకుండానే పనులు ప్రారంభించి, కేంద్రంపై వత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకుని, జాతీయ ప్రాజెక్టుగా చేయడానికి మార్గం సుగమం చేసింది...అంతా ''అప్పటి ప్రభుత్వం'...ఆ అప్పటి ప్రభుత్వం ఎవరి సారథ్యంలోనిది అన్నది మాత్రం రాయడం లేదు. 

కానీ ఇప్పుడు చంధ్రబాబు, వెంకయ్యలకు మాత్రం పోలవరం ఘనతను తెగ ఆపాదించేస్తున్నారు. మన మీడియా మనకు వుండాలే కానీ, బమ్మిని తిమ్మిని చేసేయచ్చు.

Show comments