రామ్-సంతోష్-హైపర్

సినిమాకు హైప్ రావాలంటే, మాంచి టైటిల్ కావాలి. టైటిల్ లోనే హైప్ వుంటే..వీర హైప్ వచ్చేస్తుందేమో? యనర్జిటిక్ హీరో రామ్, రభస లాంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా రభస. ఈ సినిమాకు హైపర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ టైటిల్ ను త్వరలో ప్రకటిస్తారు. ప్రస్తుతానికి అయితే వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు. కందిరీగ, రభస లాంటి టైటిళ్ల నుంచి హైపర్ అనే టైటిల్ కు వచ్చారన్న మాట సంతోష్ శ్రీనివాస్. ప్రస్తుతం రామ్ గత సినిమాల మాదిరిగానే వెల్ ప్లాన్డ్ గా చకచకా షూట్ సాగిపోతోంది ఈ హైపర్ సినిమా.

Show comments