అనసూయకు ప్లాస్టిక్ సర్జరీ నిజమేనా..?

బుల్లితెరపై నుంచి వెండితెరపైకి దూసుకొచ్చిన అనసూయ త్వరలోనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోనుందనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, తను షార్ట్ కట్స్ ను నమ్మనని ట్వీట్ చేసింది.

అనసూయకు నడుము సైజ్ పెరిగిందని, మరికొన్ని చోట్ల కూడా ఆమె కాస్త లావుగా కనిపిస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి. సైజ్ తగ్గించుకోవడానికి చాలా ఇబ్బందిపడుతున్న ఈ బ్యూటీ.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఒక్కటే మార్గమని భావించిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. 

తనను సంప్రదించకుండా వార్తలు రాసేస్తున్నారని, ఇష్టమొచ్చినట్టు కథనాలు అల్లేస్తున్నారని ట్వీట్ చేసిన అనసూయ.. తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం లేదని స్పష్టంచేసింది. అయినా ప్లాస్టిక్ సర్జరీ లాంటి షార్ట్ కట్స్ ను తను నమ్మనని అంటోంది అనసూయ.

Show comments