కొహ్లీ మళ్లీ ఫెయిల్.. అయిన మ్యాచ్ గ్రిప్ లోనే!

కాన్పూర్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో హుక్ చేయబోయి ఔట్ ఫీల్డ్ కి క్యాచ్ ఇచ్చిన కొహ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా చెత్త షాట్  కొట్టి క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్ లో కొహ్లీ నిలదొక్కుకోవడానికే ప్రాధాన్యతను ఇచ్చాడు. ఆచితూచి ఆడాడు. స్లోగా ఆడుతూ 40 బంతులు ఎదుర్కొన్న కొహ్లీ 18 పరుగుల వద్ద చేతులెత్తేశాడు.

అయితే కొహ్లీ రెండో సారి విఫలం అయినా.. ఈ మ్యాచ్ భారత్ పట్టులోనే ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ చతేశ్వర్ పూజారా అర్ధసెంచరీతో రాణించాడు. సెంచరీ దిశగా వెళ్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో బౌలర్ల విజృంభణతో భారత్ 56 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసింది.

 ఇప్పటి వరకూ 270 పరుగుల పై స్థాయి ఆధిక్యతను సాధించిన భారత జట్టు.. ఈ రోజు రెండు సెషన్ల ను పూర్తిగా ఆడే అవకాశాలున్నాయి. నాలుగు వందల వరకూ ఆధిక్యాన్ని సాధించి, కివీస్ కు చివరి సెషన్ లో బ్యాటింగ్ ను అప్పగించే అవకాశాలున్నాయి. మందకొడిగా ఉండి, స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ మీద నాలుగువందల పరుగుల లక్ష్యం చేధించడం గగనమే. 

Show comments