పూనమ్‌ పాండేతో పోటీకొస్తోంది

సోషల్‌ మీడియా 'హాట్‌' సంచలనం పూనమ్‌ పాండేకి పోటీకొస్తానంటోంది షెర్లీన్‌ చోప్రా అలియాస్‌ మోనా చోప్రా. పక్కా హైద్రాబాదీ అయిన షెర్లీన్‌ చోప్రా తెలుగులో 'ఎ ఫిలిం బై అరవింద్‌' సినిమాలో నటించిన విషయం విదితమే. ఆ తర్వాత హాట్‌ హాట్‌ ఫొటోలతో హీటెక్కించేసింది. ఇప్పుడు పూనమ్‌ పాండే స్థాయిలో అప్పట్లోనే షెర్లీన్‌ చోప్రా వార్తల్లోకెక్కింది. ప్లే బాయ్‌ మ్యాగజైన్‌ కోసం న్యూడ్‌గా కూడా ఫొటోలకు పోజులిచ్చి సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది షెర్లీన్‌. 

అయితే, ఈ మధ్యకాలంలో షెర్లీన్‌ హవా బాగా తగ్గిపోయింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే వున్నా ఆమెనెవరూ పట్టించుకోవడంలేదు. అందుకేనేమో, ఇకపై సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలు, వీడియోలతో సందడి చేయాలని నిర్ణయించుకున్నట్లు షెర్లీన్‌ చోప్రా చెప్పుకొచ్చింది. తాను హైద్రాబాదీనేనని గుర్తుచేసుకుంటూ క్రిస్‌మస్‌ వేడుకల్ని చిన్నప్పుడెలా చేసుకున్నానో సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 

ఇదిలా వుంటే, పూనమ్‌ పాండే గత ఏడాది 'జింగిల్‌ బూబ్స్‌' అంటూ ఓ హాట్‌ వీడియోతో సందడి చేసింది. ఈసారి క్రిస్‌మస్‌కి కూడా అదే స్థాయిలో జింగిల్‌ బూబ్స్‌ కొత్త వీడియోతో సందడి చేయబోతోంది. పూనమ్‌ పాండేతో పోటీ పడటమంటే ఈ మధ్యకాలంలో ఎవరూ అంతలా సాహసించడంలేదు. మరి, ఆమెకు పోటీ ఇస్తానంటోన్న షెర్లీన్‌ ఆ స్థాయిలో వార్తల్లోకెక్కగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments