కబాలి క్లిప్ అదిరిందిగా

కబాలి మీద క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. విడుదల అన్నది ఇక కొద్ది గంటల్లోకి వచ్చేసినా కూడా ఆ సినిమా విశేషాల కోసం నెటిజన్ల గాలింపు అంతకు అంతకూ పెరిగిపోతోంది. కబాలి సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సీన్ లీకయిందన్న గాలి వార్తలు కాస్తా నిజం వార్తలై కూర్చున్నాయి. ఇప్పుడు ఈ విడియో వాట్స్ అప్ లో హల్ చల్ చేస్తోంది. 

రెండు నిమషాల ఒక సెకెండ్ నిడివి వున్న ఈ విడియో క్లిప్ క్లారిటీ పెర్ ఫెక్ట్ గా వుంది. జైలు లోపల నుంచి రజనీ తన స్టయిల్ లో రెండు బస్కీలు తీసి నడుచుకుంటూ రావడం, తోటి ఖైదీలకు బై చెప్పడం, రజనీ వెళ్తుంటే వారు క్లాప్స్ కొట్టడం, రజనీ జైలు దుస్తుల నుంచి తన అసలు దుస్తుల్లోకి మారి, వేలి ముద్ర వేసి బయటకు వస్తుంటే, స్లయిడింగ్ డోర్ పక్కకు వెళ్తే రజనీ లుక్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

ఈ సీన్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యేలా ఆర్ ఆర్ మిక్స్ చేసారు. ఇప్పుడు ఈ రెండు నిమషాల సీన్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి కబాలి క్లిప్ దొరకింది అది చాలు సినిమా వచ్చేదాకా ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి.

Show comments