అటు విశాఖ, ఇటు చెన్నై.. మధ్యలో మహేష్

మహేష్ కు సంబంధించి ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్ లో జరగాల్సిందే. కానీ ఫస్ట్ టైం ఈ హీరో తన కొత్త సినిమా కోసం బయటకొస్తున్నాడు. స్పైడర్ సినిమా ఈవెంట్స్ ను ఇటు విశాఖపట్నం, అటు చెన్నైలో ప్లాన్ చేశారు.

అవును.. ఈ సినిమా తెలుగు ఆడియో ఫంక్షన్ ను వైజాగ్ లో సెలబ్రేట్ చేస్తారట. ఇక తమిళ ఆడియో రిలీజ్ ను చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు ఈవెంట్స్ కు మహేష్ బాబు హాజరవుతాడు.

త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెలలో మరో సాంగ్ షూట్ చేస్తారు. ఈ రెండు పాటల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియో రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరోవైపు స్పైడర్ కోసం మరోసారి చెన్నై వెళ్లబోతున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ చెన్నైలో జరిగింది. ఇప్పుడు డబ్బింగ్ కోసం మరోసారి చెన్నై వెళ్లబోతున్నాడు మహేష్. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకానున్న ఈ సినిమా కోసం తమిళ్ లో సొంతంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడు మహేష్.

Show comments