ఇప్పుడు టాలీవుడ్ లో డైరక్టర్ల హవా నడుస్తోంది. ఎంత గొప్ప హీరో అయినా సరైన డైరక్టర్ కాంబినేషన్ కావాలి. నితిన్ అ..ఆ అయినా, మహేష్ శ్రీమంతుడు అయినా, వరుణ్ కంచె అయినా, నాగ్ ఊపిరి అయినా, ఇంకా చాలా సినిమాలు చెప్పే సంగతి ఇదే. అందుకే హీరోలంతా ఇప్పుడు ఏరి కోరి డైరక్టర్లను దగ్గరకు తీస్తున్నారు. ఎన్టీఆర్ కావాలని కొరటాల శివను దగ్గరకు తీసాడు. పవన్ కోరి త్రివిక్రమ్ ను తనతో సినిమా చేయమని మరీ అడిగాడు.
సో..కాస్త పట్టున్న డైరక్టర్లంతా ఇప్పుడు తలా ఓ సినిమాతో బిజీ అయిపోయారు. సినిమాలు లేని హీరోలు డైరక్టర్లు కావాలనుకున్నా కనుచూపుమేరలో కనిపించడం లేదు. రవితేజ వ్యవహారం ఇలాగే వుంది. అక్కినేని అఖిల్ పరిస్థితి ఇదే. సరే అఖిల్ కు అంటే ఓ పట్టాన ఏ డైరక్టర్ ఆనడం లేదో, నచ్చడం లేదో? మరి అ..ఆ తో హిట్ కొట్టిన నితిన్ కు ఏమయింది? తరువాతి సినిమాను ఎందుకు ఇంతవరకు ప్రారంభించడం లేదు.
మంచి డైరక్టర్ వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఏ సినిమా టేకప్ చేయలేదు. పివిపి కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసే ప్రయత్నంలో వున్నారని వినికిడి.సరే, మహేష్ ఊ అన్నా, ఆ సినిమా స్టార్ట్ కావాలంటే కనీసం ఆరు నెలలయినా పడుతుంది. మరి అలాంటి గ్యాప్ ను నితిన్ లాంటి హీరో ఎందుకు వాడుకోకూడదు.
సరే, నితిన్ అంటే ఏమాలోచిస్తున్నాడో అనుకున్నా, మరి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సంగతేమిటి? మంచి డైరక్టర్ గా పేరు సంపాదించిన వంశీ పైడిపల్లిని ఆయన ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నట్లు? ఏదో వుంది..అదేమిటో మరి?