ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

దీపావళికి స్ట్రెయిట్‌ సినిమాలేవీ రాకపోవడంతో 'కాష్మోరా' పండగ చేసుకుంది. తమిళ హీరోల్లో కార్తీకి ఇక్కడ నిఖార్సయిన మార్కెట్‌ వుందని ఇది మరోసారి రుజువు చేసింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రానికి వసూళ్లు బాగున్నాయంటేనే కార్తీ పట్ల మనవారికి ఉన్న ఇష్టం తెలుస్తుంది.

మొదటి వారాంతంలోనే అయిదు కోట్లకి పైగా షేర్‌ సాధించిన కాష్మోరా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది. ఈ వారంలో చెప్పుకోతగ్గ సినిమాలేవీ లేవు కనుక ఇది సేఫ్‌ జోన్‌కి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ధర్మయోగి చిత్రానికి టాక్‌ బానే వుంది కానీ పబ్లిసిటీ బాలేదు.  

ఇజం ఓవరాల్‌గా యావరేజ్‌ స్థాయిని మాత్రం అందుకోగలిగింది. మరోసారి పూరి జగన్నాథ్‌ సినిమాకి నష్టాలు తప్పలేదు. నవంబర్‌లో భారీ సినిమాలేవీ విడుదల కావడం లేదు. దీంతో చిన్న సినిమాలని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకున్నారు. వీటిలో కొన్ని చెప్పుకోతగ్గ సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఆఫ్‌ సీజన్‌లో నిలబడతాయో లేదో చూడాలి.

Show comments