ఇక్కడ హీరోయిజం..అక్కడ క్రియేటివిటీ

ఒకే సినిమా..రెండు భాషలు..రెండు ఫస్ట్ లుక్ లు. కత్తి సినిమా ఫస్ట్ లుక్ అప్పట్లో ఓ సంచలనం. దర్శకుడు మురగదాస్ క్రియేటివిటికి అద్దం పడుతుంది. అదే సినిమా తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్ హడావుడి తప్ప, పోస్టర్ లో స్పెషాలిటీ ఏమీ కనిపించడం లేదు. బాస్ ఈ జ్ బ్యాక్ అంటూ అభిమానులను అలరించే ప్రయత్నం తప్ప.

కానీ అదే తమిళ కత్తి ఫస్ట్ లుక్ లో అర్బనైజేషన్ ను చూపిస్తూనే, జర్నలిజం, దేశంలోని వివిధ సంస్థలు, పెట్టుబడి వ్యవహారాలు ఇవన్నీ స్ఫురించేలా, ఓ సృజనాత్మక ఆవిష్కరణ కనిపిస్తుంది. దటీజ్ మురుగదాస్ అనేలా వుంటుంది అది. మనవాళ్లకు కథలు కావాలి కానీ ట్రీట్ మెంట్, ఇతరత్రా వ్యవహారాలు మళ్లీ రెగ్యులర్ గా మన రొడ్డ కొట్టుడు టైపే వుండాలేమో? ఒక పక్క చిన్న కొత్త సినిమాలు విజయవంతం అవుతుంటాయి. కుర్రాళ్లు సూపర్  గా తీసారని ప్రశంసలు కురిపిస్తుంటారు. 

ఇండస్ట్రీలోకి ఇలాంటి వాళ్లు రావాలి అని పిలుపులు వినిపిస్తుంటాయి. కానీ సీనియర్లు మాత్రం రెగ్యులర్ మాస్ మసాలా టైపులోనే ముందుకు వెళ్తుంటారు.

Show comments