మహేష్ బాబు దగ్గర వున్న అడ్వాన్స్ ను వెనక్కు తెచ్చుకున్నారు హారిక హాసిని చినబాబు. ఇది చాలా కాలం కిందటి ముచ్చట. ఇప్పుడు అదే సమస్య అయిందని వినికిడి. అ..ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మరో సినిమా చేయాలని చినబాబు అనుకుంటే, కనుచూపు మేరలో ఏదీ కనిపించడం లేదు. మహేష్ ఒప్పందం వుండి వంటే, మురుగదాస్ సినిమా ముందుగానో, వెనుకగానో, సమాంతరంగానో త్రివిక్రమ్ తో సినిమా చేసేవాడు మహేష్.
ఇక మహేష్ తో సినిమా అంటే త్రివిక్రమ్ కు పవన్ ఆబ్లిగేషన్ కూడా వుండేది కాదేమో? అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజానికి బన్నీ ఇప్పుడు రెడీగా వున్నాడు. త్రివిక్రమ్ ఊ అంటే ఆరేడు నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది. కానీ త్రివిక్రమ్ తను కళ్యాణ్ తోనే సినిమా చేస్తా అంటున్నారని వినికిడి. అదే మహేష్ దగ్గర అడ్వాన్స్ వుండి వుంటే అటు వెళ్లే వారేమో? మొత్తానికి ఇప్పుడు ఆ అవకాశం లేదు. వస్తే కాదనరు మహేష్.. అడగకుండా వెళ్లరు వీళ్లు. సో..ఇక ఆ చాన్స్ వుండదు.
అందువల్ల పవన్-డాలీ సినిమా అయ్యేదాకా త్రివిక్రమ్ ఖాళీగా వుండాలా? లేక..అ..ఆ మాదరిగా ఉ..ఊ అని మరో చిన్న సినిమా ఏదయినా చేసేస్తారా?