పతంజలికి 172 ఎకరాలు

కేంద్ర ప్రభుత్వానికి రాజగురువు లాంటి రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇతోథికంగా సహకరిస్తోంది. అందుకే విజయనగం జిల్లాలో ఏకంగా 172 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ పచ్చ జెండా ఊపేసింది. ఎకరా ఎంత లెక్కన ఇస్తున్నారు తదితర వివరాలు తెలియాల్సి వుంది. 

ఎలా ఇచ్చినా మార్కెట్ రేటు కు అయితే ఇవ్వరు. కాస్త దిగువనే రేటు ఫిక్స్ చేస్తారు. కానీ అక్కడ చలామణీ రేటు అంతకు అంతా ఎక్కువే వుంటుంది. ఎకరాకు హీనంలో హీనం లక్ష రూపాయిలు తక్కువకు దొరికినా దగ్గర దగ్గర రెండు కోట్లు లాభం వచ్చేస్తుంది. కానీ ఎకరాకు లక్షేం ఖర్మ ఇంకా ఎక్కువే లాభం వచ్చేలా వుంటుంది వ్యవహారం. అదీ తెలుస్తుంది ఎలాగూ. పతంజలి సంస్థ ఏమీ సేవాసంస్థ కాదు.

కార్పొరేట్ కంపెనీలను ఢీకొడుతూ, భారీగా వ్యాపారం నిర్వహిస్తూ, వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ. మరి అలాంటి సంస్థను ప్రయివేటుగా భూ సేకరణ చేసుకోమని చెప్పక, ప్రభుత్వం భూములు అప్పగించడం ఏమిటో? ప్రయివేటు సంస్థ తనంతట తాను భూసేకరణ చేస్తే, రైతులకు మంచి రేటు వస్తుంది. ప్రభుత్వ భూములు మిగులుతాయి. కానీ ఇలా చేస్తే, పతంజలికి లాభం. కానివ్వండి..మన మోడీగారికి, మనకు యోగాగురువు కదా.

Show comments