వరదబాధితులు లేరిక్కడ

సినిమా జనాలు కావచ్చు వేరే జనాలు కావచ్చు హైదరాబాద్ వర్ష బాధితుల వ్యవహారంలో తప్పటడుగు వేస్తున్నారు. పాల పాకెట్లు, చార్జింగ్ సాకెట్లు అంటున్నారు. కానీ ఇక్కడ కావాల్సినవి అవి కావు. సహాయం మాన్యువల్ గా కావాలి. రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. వీధుల్లో నీరు నిలిచింది. ఇక్కడ మనుషులు చేయాల్సిన పనులు వున్నాయి. పులిహార ప్యాకెట్లు కాదు. 

గోతులు పడిన రోడ్లను తాత్కాలికంగా కంకరతో మూయడం, దాని వల్ల నీరు నిలవదు. అలాగే పూడుకు పోయిన కాల్వలను తెరిపించడం, వీధుల్లో వుండిపోయిన నీరు ఫ్రీగా ఫ్లో అయ్యేలా చేయడం, ఇలాంటి సాయాలు కావాలి. ఇందుకు కావాల్సింది చేతనైతే చేత సాయం లేదంటే డబ్బుల సాయం. 

ఒక్కో సినిమా నటుడు ఒక్కో వీధిని దత్తత తీసుకుని చోటా మోటా కాంట్రాక్టర్లను పంపించి,రోడ్లపై గోతులను పూడ్పిస్తే, ట్రాఫిక్ సజావుగా సాగుతుంది. నీరు నిలువ వుండిపోయి వ్యాధులు ప్రబలవు. ఇలాంటివి చేయాలి. అంతే కానీ ఆహార పొట్లాలు, పాల పాకెట్లు కాదు. 

Show comments