కత్రినా మళ్ళీ 'కేక' పుట్టించింది.!

కత్రినాకైఫ్‌.. డాన్సుల్లో చితక్కొట్టేయగలదని 'చికినీ చమేలీ..' 'మై నేమ్‌ ఈజ్‌ షీలా..' పాటలతో నిరూపించింది. కత్రినా కైఫ్‌కి డాన్సుల్లో ఇంత టాలెంట్‌ వుందా.? అని బాలీవుడ్‌తోపాటు, టాలీవుడ్‌ కూడా ఆశ్చర్యపోయింది. ఎప్పటికప్పుడు తనదైన డాన్సులతో అందర్నీ విస్మయానికి గురిచేస్తున్న కత్రినాకైఫ్‌, తాజాగా 'కాలా చష్మా..' అంటూ ఇరగదీసేసింది. 

బాలీవుడ్‌లో కత్రినా నటిస్తోన్న తాజా చిత్రం 'బార్‌ బార్‌ దేఖో'. ఈ చిత్రం కోసం హీరో సిద్దార్ధ మల్హోత్రాతో కలిసి 'కాలా ఛష్మా' పాటకి స్టైలిష్‌గా స్టెప్పులతో అదరగొట్టేసింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో సాంగ్‌ వైరల్‌ అయిపోయింది. ఇంటర్నెట్‌లో విడుదలైన కాస్సేపటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించేస్తోందట. 

Video: Watch Kala Chasma Song

సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దర్శకుడు నిత్యా మెహ్రా. సినిమాలో కత్రినా, సిద్దార్ధ మల్హోత్రా మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి బాలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. రణ్‌బీర్‌కపూర్‌తో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన కత్రినా, ఈ మధ్య అతనికి కాస్త దూరంగా వుంటోన్న విషయం విదితమే. సిద్దార్ధ, కత్రినా మధ్య తాజా ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌.. కత్రినా - రణ్‌బీర్‌ల మధ్య గ్యాప్‌ని మరింత పెంచడం ఖాయమని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

Show comments