ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

నిర్మలా కాన్వెంట్‌ చిత్రంపై విపరీతమైన నమ్మకంతో బయ్యర్లు భారీ రేట్లు పెట్టి కొన్నారు. ఈమధ్య కాలంలో నాగార్జున ఉన్న ఫామ్‌కి అతడినుంచి ఫ్లాప్‌ వచ్చే అవకాశమే లేదనుకున్నారో ఏమో కానీ మీడియం రేంజ్‌ హీరోల చిత్రాలకి జరిగిన స్థాయిలో దీనికి బిజినెస్‌ జరిగింది. 

అయితే సినిమా అనూహ్య పరాజయం పాలయింది. సినిమా బాగోకపోవడం వల్ల కలక్షన్లు తగ్గిపోయాయని అనుకోవచ్చు. కానీ అసలు దీనికి ఓపెనింగ్స్‌ కూడా సరిగా రాలేదు. టీవీ యాక్టర్‌ సాగర్‌కి సిద్ధార్థతో చేదు అనుభవం ఎదురైంది. గత వారం వచ్చిన సినిమాలేవీ ప్రభావం చూపించకపోవడంతో, జనతా గ్యారేజ్‌కి లాస్ట్‌ వీకెండ్‌ కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి.

ఈ చిత్రం ఆల్‌టైమ్‌ టాప్‌ గ్రాసర్ల లిస్టులో మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇక విక్రమ్‌ 'ఇంకొక్కడు' సినిమా కూడా సేఫ్‌ జోన్‌కి వెళ్లిపోయింది. జ్యో అచ్యుతానంద రెండవ వారాంతంలో బాగా పుంజుకుంది. చాలా కాలం తర్వాత వారాహి బ్యానర్‌కి మరో హిట్‌ సినిమా వచ్చినట్టయింది. ఈ వారంలో మజ్ను, రైల్‌ విడుదలయ్యాయి. వీటి ఫలితం తేలాల్సి వుంది. 

Show comments