కలా? నిజమా? ఏంటీ వైపరీత్యం.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక్కసారిగా రూటు మార్చేశారు. ఏం జరిగిందో ఏమో, కరువు మీద చంద్రబాబు ఏకంగా యుద్ధమే ప్రకటించేశారు. పొరుగు జిల్లాల నుంచి వాటర్‌ ట్యాంకర్లతో నీటిని తరలించడమంటే, అదేదో తాగు నీటి కోసం.. అనుకునేరు. కానీ, కాదు. చంద్రబాబు నీటిని ట్యాంకర్లతో తరలిస్తున్నది పంటల్ని కాపాడటానికి. వినడానికి షాకింగ్‌గా వున్నా ఇది నిజంగానే నిజం. 

తాగడానికి ట్యాంకర్లతో నీటిని తరలించడమంటేనే అది బోల్డంత వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అలాంటిది, సాగు కోసం ట్యాంకర్లతో నీటిని తరలించడం చిన్న విషయం కానే కాదు. ఎంత నీరని ట్యాంకర్లలో తరలిస్తారు.? ఎంతైనాసరే, ఎంత ఖర్చయినాసరే.. అంటున్నారు చంద్రబాబు. ఒక్క ఎకరంలోని పంట కూడా ఎండిపోకూడదట. రాయలసీమలో పచ్చదనే తన జీవితాశయం.. అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తోంటే ముక్కున వేలేసుకోవడం విపక్షాల పనవుతోంది. టీడీపీ నేతలే చంద్రబాబు వ్యవహారాన్ని చూసి షాక్‌కి గురవుతున్నారు. 

వ్యవసాయం దండగ.. అన్న చంద్రబాబేనా, ఇలా రైతుల కోసం కిందా మీదా పడుతున్నది.? అనడక్కండి, 'అసలు వ్యవసాయం దండగ అని నేనెక్కడన్నాను..' అని ఎదురు ప్రశ్నిస్తారు. పోన్లెండి, రైతుల కోసమే కదా, ఎంత కష్టపడ్డాసరే, ఏం చేసినా సరే.. ఈ విషయంలో చంద్రబాబుని అభినందించి తీరాల్సిందే. కానీ, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేయడంలేదు కదా.? అంటే, ఇందులో డౌటేముంది.. పబ్లిసిటీ రాకపోతే చంద్రబాబు ఏ పనీ చెయ్యరు కదా.. అనే చెప్పాలి. 

ఒక్కటి మాత్రం నిజం. వున్నపళంగా చంద్రబాబు పచ్చదానికి ప్రేమికుడైపోతే.. విపత్తులే సంభవిస్తాయి. కరువు మాటేమోగానీ, సూర్యుడు పడమర దిక్కున ఉదయించేస్తాడేమోనని భయంగా వుందంటూ సోషల్‌ మీడియాలో చంద్రన్న మీద సెటైర్లు పడ్తున్నాయి. Readmore!

Show comments

Related Stories :