ఆ హీరో దెబ్బ తినేసాడా?

టాలీవుడ్ టాప్ హీరో ఒకరు నోట్ల రద్దు పుణ్యమా అని కాస్త గట్టి దెబ్బ తిన్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అతని దగ్గర పాత నోట్లు వుండిపోవడం కాదట. ఆయన పరోక్షంగా పెట్టుబడులు అందించిన వ్యక్తులు దెబ్బతినడమే కారణం అని తెలుస్తోంది. 

తన దగ్గరకు వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఓ నిర్మాతకు, ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ కు పంపేయడం ఆ హీరో భార్యకు అలవాటు అని తెలుస్తోంది ఈ పెట్టుబడులతో ఆ డిస్ట్రిబ్యూటర్  కమ్ ఎగ్జిబిటర్ ఇటీవల చాలా థియేటర్లు లీజుకు తీసుకుని డెవలప్ చేసారని వినికిడి. పైగా భారీ రేటుకు ఓ భారీ సినిమా హక్కులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు అతని దగ్గర భారీగా నగదు వుండిపోవడంతో, పరిస్థితి తారుమారయింది. అంటే పరోక్షంగా ఆ హీరో కూడా దెబ్బతినేసినట్లే. 

అలాగే అదే హీరో జస్ట్ ఫ్యూ డేస్ కింద కొన్న సైట్ కు పాత నోట్లు ఇచ్చారట. ఇప్పుడు అవి వెనక్కు తీసుకోమని, లేదంటే టాక్స్ డిపార్ట్ మెంట్ కు సోర్స్ చెప్పేస్తానని సదరు సైట్ అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగాడట. ఈ లావాదేవీని ఎలా పరిష్కరించాలా అని ఆ హీరో సంబంధీకులు కిందా మీదా అవుతున్నారట. అలాగే అదే హీరో నుంచి పెట్టుబడులు అందుకునే ఓ నిర్మాణ సంస్థ దగ్గర కాస్త పెద్ద మొత్తంలోనే క్యాష్ వుండిపోయిందని టాక్. 

ఇలా అన్ని విధాలా ఆ హీరోతో సంబంధం వున్న వారు దెబ్బతిన్న ఎఫెక్ట్ హీరో మీద పడేలా వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Show comments