చిరంజీవితో మిస్ అయింది.. బోయపాటితో సెట్ అయింది

సరైనోడు సినిమాలో అందమైన ఎమ్మెల్యేగా అందర్నీ మెస్మరైజ్ చేసిన క్యాథరీన్ గుర్తుందా. ఆ సినిమా తర్వాత ఏకంగా చిరంజీవి 150వ సినిమాలో చిందేసే ఛాన్స్ కొట్టేసింది క్యాథరీన్. అయితే అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. లాస్ట్ మినిట్ లో క్యాథరీన్ స్థానంలో లక్ష్మీరాయ్ ను తీసుకున్నారు. అప్పట్నుంచి కెమెరాకు దూరమైన ఈ భామ, ఎట్టకేలకు బోయపాటి శ్రీను సినిమాతో మరోసారి మనముందుకురానుంది.

ఖైదీ నంబర్ 150లో ఆఖరి నిమిషంలో ఐటెంసాంగ్ మిస్ చేసుకున్న క్యాథరీన్, ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాలో ఐటెం నంబర్ అవకాశాన్ని దక్కించుకుంది. ఖైదీ నంబర్ 150 సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీనే.. ఈ సినిమాకు కూడా అదిరిపోయే ఐటెంసాంగ్ కంపోజ్ చేశాడట. 

అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, క్యాథరీన్ మధ్య ఈ ఐటెంసాంగ్ ను పిక్చరైజ్ చేస్తారు. నిజానికి క్యాథరీన్ కంటే ముందు ఈ స్పెషల్ సాంగ్ కోసం కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. కానీ బోయపాటి మాత్రం సెంటిమెంట్ కొద్దీ క్యాథరీన్ కు ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు.

Readmore!
Show comments

Related Stories :